పబ్లిక్ పల్స్

ప్రజ నాడిని పట్టుకుందాం

నాయకుడికి తన ప్రజలెవరో తనకు తెలియాలి. వాళ్ళ ఆలోచనల మీదా, ఆశల మీదా పట్టు సాధించాలి. వాళ్ళ మనసుల్లో ఏం నిర్ణయించుకున్నారో తొంగి చూడాలి. తీర్పు ఇచ్చే రోజు రాక ముందే తన వెంట వున్నారో లేదో తేల్చుకోవాలి. ప్రజల ఆలోచనల్లో కూడా ఊగిసలాట వుంటుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వారిని ఉద్వేగాలకు గురయ్యే అంశాలు రావచ్చు. ఎన్నికలు రావటానికి నెలల ముందో, వారాల ముందో ఈ పరిణామాలు జరిగి పోవచ్చు. వాటి ప్రభావాన్ని మరో మరో సరి చూసుకోవాలి. మారిన వాళ్ళ నాడికి అనుగుణంగా ప్రచార వ్యూహాలను సరిదిద్దుకోగలగాలి.

ప్రజల నాడిని పట్టుకోవటానికి ప్రత్యేకమైన శాస్త్రం సెఫాలజీ వుండనే వుంది. దీని ఆధారంగానే ఓటర్ల అభిప్రాయ సేకరణను ఎన్నికల ముందూ( ఒపీనియన్‌ పోల్స్‌), ఎన్నికల తర్వాతా( ఎగ్జిట్‌ పోల్స్‌) చేస్తుంటారు.

ప్రముఖ పత్రికా సంపాదకులు, సతీష్‌ చందర్‌ 1994 నుంచీ అనేక ఎన్నికల సర్వేలను నిర్వహిస్తూ వచ్చారు. అన్ని సందర్భాల్లోనూ ఆయన అంచనాలు, అసలు ఫలితాలకు అతి దగ్గరగా వచ్చాయి.

1994 అసెంబ్లీ ఎన్నికల ముందు సర్వే: ఎన్టీఆర్‌ పునరాగమనం

అయిదేళ్ళ పాటు అతికష్టం మీద ప్రతిపక్ష నేతగా కొనసాగిన 1994 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారం పొందటం కోసం అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగానే ఒక ప్రచార సభలో లక్ష్మీ పార్వతిని తాను చట్ట బధ్ధంగా వివాహం చేసుకున్న భార్యగా ప్రజలకు పరిచయం చేశారు. ఆ తర్వాత సాగిన ప్రచారం మొత్తం లో ఆమెను వెంటబెట్టుకునే తిరిగారు. ఎన్టీఆర్‌ విజయావకాశాలు ఆమె వల్ల సన్నగిల్లి పోతాయనే అత్యధిక ప్రసార మాధ్యమాలు భావించాయి.

అప్పుడు తెలుగులో ఇండియా టు డేకు పోటీగా నిలిచిన సుప్రభాతం దిన పత్రిక కు సంపాదకుడిగా వున్న సతీష్‌ చందర్‌ తన బృందంతో ఎన్నికల ముందే సర్వే చేయించి ఎన్టీఆర్‌ తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నట్లు వెల్లడించారు. అంతే కాదు ఏయే నియోజకవర్గాలనుంచి, ఏయే అభ్యర్థులు ఎంతెంత మెజారిటీతో గెలవ నున్నారో కూడా ముందుగా వెల్లడించారు.

1996 సార్వత్రిక ఎన్నికల ప్రీ పోల్‌ సర్వే: లక్ష్మీ పార్వతి పార్టీ పతనం

లక్ష్మీ పార్వతి నేతృత్వంలోని ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ 1996 సార్వత్రిక ఎన్నికలలోతుడిచి పెట్టుకుబోతోందని వార్త దినపత్రిక వ్యవస్థాపక (సహ) సంపాదకునిగా సతీష్‌ చందర్‌ తన బృందంతో సర్వే చేయించి బయిట పెట్టారు. నిజానికి ఆ ఎన్నికలప్పుడు వార్త యాజమాన్యం లక్ష్మీ పార్వతికి అనుకూల వైఖరి తీసుకున్నది. అయినప్పటికీ, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ సర్వేను ప్రచురించటానికి అనుమతించింది. సర్వే అంచనాలకు తగ్గట్టుగానే ఫలితాలు వచ్చాయి.

1999 పార్లమెంటు అసెంబ్లీల ఎన్నికల సర్వే: కార్గిల్‌ యుధ్ధ ప్రభావం

ఎ.పి. కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం, డైరెక్టర్‌గా ఈ ఎన్నికలలో కార్గిల్‌ యుధ్ధ ప్రభావం బీజేపీకి అనుకూలంగా వుండబోతోందని తన సుశిక్షితులైన విద్యార్థుల ద్వారా సర్వే చేయించి సతీష్‌ చందర్‌ ప్రకటించారు. అంతే కాదు రాష్ట్రంలో బీజేపీ తో పొత్తు, తెలుగు దేశం పార్టీకే ఎక్కువ లాభిస్తుందని గణాంకాల ద్వారా నిరూపించారు. అనుకున్నట్టుగా రాష్ట్రంలో తెలుగు దేశం మళ్ళీ అధికారంలోకి వచ్చింది.

2004 అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజాభిప్రాయం: చంద్రబాబు పై నక్సల్స్‌ దాడి ప్రభావం

ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు పై అలిపిరి వద్ద నక్సలైట్ల దాడి ప్రభావం ఎన్నికల మీద ఎంతవరకూ వుంటుందనే అంశం మీద ఆంధ్రప్రభ దిన పత్రిక ప్రధాన సంపాదకుడిగా సతీష్‌ చందర్‌, ఎ.పి.కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం విద్యార్థులతో విస్తృతంగా సర్వే చేయించారు. ప్రాణాపాయం నుంచి స్వల్పగాయాలతో బయిట పడ్డ చంద్రబాబు పై వుండే సానుభూతి, ఓట్లగా మారే అవకాశం వుందా- అని అంశాన్ని ఈ సర్వేలో నిగ్గు తేల్చారు. ఉండదనే ముందుగానే తేల్చి, చంద్రబాబు ఓటమిని పసిగట్టారు.

ఇప్పటికీ సతీష్‌ చందర్‌ తన బృందంతో సర్వేలు నిర్వహిస్తూనే వున్నారు. రెండేళ్ళ క్రితమే రాజకీయ నేతలకు తర్ఫీదునిచ్చేందుకు ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ పొలిటికల్‌ లీడర్‌షిప్‌ అనే సంస్థను స్థాపించారు.