మీరూ నేతలు కావచ్చు!
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ లీడర్ షిప్ (ఐఐపిఎల్) లో 2024-25 విద్యాసంవత్సరానికి ఆన్ లైన్ లో లెవెల్-1 కోర్సు (సర్టిఫికెట్ కోర్స్ ఇన్ పొలిటికల్ లీడర్ షిప్) లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఎన్నికల రాజకీయాలలో నేడు కొరవడింది నాయకత్వమే.
వోటర్-కేడర్-లీడర్ అనే ఈ మూడంచెల రాజకీయ వ్యవస్థలో లీడర్ పాత్ర కీలకమయినది. సంక్షోభం నుంచి నాయకత్వం పుడుతుందంటారు. సంక్షోభాలకు ఎదురు నిలిచి, ఎదగ గలిగే నాయకత్వ నైపుణ్యాల్ని ఇవ్వటమే ఈ ఇనిస్టిట్యూట్ ఉద్దేశ్యం.
నైపుణ్యాలు
ఈ ఇనిస్టిట్యూట్ లో హాజరయ్యే విద్యార్థులకు ఈ కింది నైపుణ్యాలను ఎలా పెంపొందించుకోవాలో అవగాహన కల్పిస్తుంది:
– వర్తమాన రాజకీయాలలో అవకాశాలను అందిపుచ్చుకోవటం
-సందర్భానికి సరిపడా వ్యూహాలనూ, ఎత్తుగడలనూ వెయ్యటం
-వాక్చాతుర్యాన్నీ, వక్తృత్వాన్నీ పెంచుకోటం
-ప్రజల నాడిని పట్టుకోవటం.
– మీడియా దృష్టిని ఆకర్షించటం
బోధనాంశాలు
– విజయవంతమయిన నాయకులు: నాయకత్వ లక్షణాలు
– ప్రజల్ని ఆకట్టుకునే ఉపన్యాసాలు ఇవ్వటం
– కార్యకర్తల్లో విశ్వాసాన్ని నెలకొల్పే ‘కౌన్సెలింగ్’ చేయటం
– మీడియాకు ప్రకటనలివ్వటం; టీవీ చర్చల్లో పాల్గొనటం
– నిర్వహించిన కార్యక్రమాలకు మీడియా కవరేజ్ తెచ్చుకోవటం.
– రాష్ట్రంలో రాజకీయ పార్టీల తీరుతెన్నులు: వాటి నేపథ్యం-ఎన్నికల ముందు, ఎన్నికలప్పుడు, ఎన్నికల తర్వాత వివిధ పార్టీల వ్యూహాలు
-ప్రజాసమస్యల్ని రాజకీయ ఉద్యమాలుగా మలచటం.
బోధన విధానం:
గవిద్యార్థుల్ని భాగస్వాముల్ని చేసే పధ్ధతిలో బోధన సాగుతుంది. కేస్ స్టడీస్,పవర్ పాయింట్ ప్రజంటేషన్స్, డెమోలూ, మాక్ ఇంటర్వ్యూలూ, మాక్ టీవీ చర్చలతో పాటు, ప్రతీ సెషన్ తర్వాత ప్రశ్నలూ, సమాధానాలూ వుంటాయి. వినోదంలోనుంచి విజ్ఞానం వచ్చినట్టుగా మొత్తం బోధన సాగుతుంది.
ఎవరు విద్యార్థులు?
ఇంజనీరింగ్, మెడిసిన్ లలాగా, రాజకీయాలను తమ కేరీర్ గా తీసుకోవాలనుకున్న వారికోసం ఈ ఇన్సిట్యూట్. వృత్తి రాజకీయనాయకులుగా ఎదగాలనే కోరికా, పట్టుదలా వున్న వారు, ఎవరయినా ఈ కళాశాలలో చేరవచ్చు.
సిలబస్:
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ పొలిటికల్ లీడర్ షిప్(సిపిఎల్)
ఈ కోర్సులో ఏడు పేపర్లు వుంటాయి:
పేపర్ 1: నాయకత్వం
పేపర్ 2: వక్తృత్వం
పేపర్3: ఎన్నికల రాజకీయాలు
పేపర్4: రాజకీయ పార్టీలు: సిధ్ధాంతాలు
పేపర్5: మీడియా నిర్వహణ
పేపర్6: పౌరసంబంధాలు: సర్వేల నిర్వహణ
పేపర్7: ఆర్థికాంశాలు- సంక్షేమం
తరగతుల షెడ్యూలు:
ఆన్ లైన్ లో రోజుకు రెండు గంటలు చొప్పున ఎనిమది వారాంతాలు (శుక్ర, శని, ఆదివారాలు)
కోర్సు ఫీజు: రు. 15,000 (పదిహేను వేల రూాపాయిలు మాత్రమే.)
ప్రవేశానికి విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ . వయస్సుకు గరిష్ట పరిమితి లేదు.
అడ్మిషన్ పొందు విధానం:
ప్రవేశం కోరు వారు తమ పేరును రిజిస్టరు చేసుకుని, దరఖాస్తు ఫారం ఈ మెయిల్ ద్వారా పొందటకం కోసం రు.100లు ఇన్సిట్యూట్ బ్యాంక్ అక్కౌంట్ కు ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చెయ్యాలి.
Account Name: Indian Institute of Political Leadership
Bank Name : Canara Bank, Hyderabad, Gandhinagar Branch
Account No. : 1179201002232 IFSC Code : CNRB0000848
మీ నగదు బదిలీ అయిన వెంటనే contact@iipl.org కు మీ పేరు, అడ్రసుతో పాటు Transaction Details పంపితే, మీ Registration ప్రోసెస్ అవుతుంది. మీకు ఈ మెయిల్ ద్వారా నంబరు ముద్రించిన దరఖాస్తు ఫారం అందుతుంది.
అలా పొందిన దరఖాస్తును పూర్తి చేసి, దరఖాస్తుఫారం లో సూచించిన ప్రకారం, కోర్సు ఫీజు ఆన్ లైన్ ద్వారా చెల్లించి, దాని ఎస్.ఎస్.సి, డిగ్రీ సర్టిఫికెట్లను స్కాన్ చేసి దరఖాస్తుతో పాటు contact@iipl.org కు మెయిల్ చెయ్యాల్సి వుంటుంది.
రిజిస్ట్రేషన్ చేసుకుని ,ఆన్ లైన్ దరఖాస్తు పొందటానికి చివరి తేదీ:
పూర్తి చేసిన దరఖాస్తులు పంపటానికి చివరి తేదీ: 25 జనవరి 2024
మా కళాశాల కార్యనిర్వాహక కార్యాలయ చిరునామా:
First Floor, Chabda Towers,
SRT-42 (Near Ashok Nagar Cross Roads) Jawahar Nagar, Hyderabad-500 020
వివరాలకు 98485 12767, 83415 58346 నెంబర్లలో సంప్రదించవచ్చు.